మరో మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌!

8 Sep, 2019 16:09 IST|Sakshi

ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్‌ హీరో రామ్‌ పోతినేని తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. గతంలో ఎక్కువగా రొమాంటిక్‌ సినిమాలు మాత్రమే చేసిన రామ్‌, ఇస్మార్ట్ శంకర్‌ సక్సెస్‌ తరువాత రూట్ మార్చాడు. మాస్‌ కథల కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో మరో మాస్‌ కమర్షియల్ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

కొంత కాలంగా తన రేంజ్‌కు తగ్గ సక్సెస్‌లు సాధించటంతో ఫెయిల్ అవుతున్న సీనియర్‌ దర్శకుడు వీవీ వినాయక్‌, రామ్‌ హీరోగా ఓ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే రామ్‌కు కథ వినిపించి ఓకె చేయించుకున్న వినాయక్‌, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో లీడ్‌ రోల్‌లో నటిస్తున్న వినాయక్ ఆ సినిమాకన్నా ముందే రామ్ సినిమాను పట్టాలెక్కిస్తాడా? లేక ఆ సినిమా పూర్తయ్యాక మొదలుపెడతాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు