ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!

6 Aug, 2017 10:16 IST|Sakshi
ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డేకు ఒక్కరోజు ముందు రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.