రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

6 Sep, 2019 06:20 IST|Sakshi
బి. గోపాల్‌తో ఇంద్ర, సుక్రుతా వేగల్‌...

– బి. గోపాల్‌

‘‘రామచక్కని సీత’ మంచి టైటిల్‌.. చాలా బాగుంది. ఈ సినిమా హీరో ఇంద్ర చాలా మంచి అబ్బాయి. తనంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మంచి విజయం సాధించి, హీరో, హీరోయిన్‌కి, యూనిట్‌కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ అన్నారు. ఇంద్ర, సుక్రుతా వేగల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రామచక్కని సీత’. శ్రీహర్ష మండాని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాలాక్షి మండా, జి.ఎల్‌. ఫణికాంత్‌ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బి.గోపాల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మండా మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ప్రోత్సహించిన దాసరి కిరణ్‌గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు.

ఫణికాంత్‌ నా స్నేహితుడు. నా కోసం ఈ సినిమా తీశాడు. మా చిత్రం ద్వారా ఇంద్ర, సుక్రుతా వేగల్‌ పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని ఇంత దూరం తీసుకువచ్చాం’’ అన్నారు ఫణీంద్ర. ‘‘మా సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశాలాక్షి. ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకి కృతజ్ఞతలు’’ అన్నారు ఇంద్ర. ‘‘కన్నడలో నేను 7 చిత్రాల్లో నటించా. తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. కన్నడ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా’’ అని సుక్రుతా వేగల్‌ అన్నారు. రచయిత విస్సు, నిర్మాత మల్టీ డైమన్షన్‌ వాసు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం

డిజిటల్‌ ఎంట్రీ

నిత్యా @ 50

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!

నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చిన హీరో

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

అనుష్కని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా?

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

రేంజర్‌గా సిబిరాజ్‌

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం

డిజిటల్‌ ఎంట్రీ

నిత్యా @ 50

చేజింగ్‌.. చేజింగ్‌