‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’

22 Sep, 2019 17:37 IST|Sakshi

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌. హీటెక్కించే మాస్‌ సాంగ్‌ అయినా.. ఎప్పటికీ నిలిచిపోయే క్లాసికల్‌ సాంగ్‌ అయినా, ప్రేమ పాటలు, విషాద పాటలు ఇలా అన్నింటిలో తన ముద్ర వేస్తూ.. సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు. 

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిరంతరం బిజీగా ఉండే.. దేవీ ప్రస్తుతం మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ బాణీలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కలిస్తే.. ఇక ఆ పాట ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. 

వీరి కాంబినేషన్‌లో మహేష్‌ బాబుకు చాలానే హిట్‌ సాంగ్స్‌ పడ్డాయి. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షిలతో హ్యాట్రిక్‌ కొట్టిన ఈ ద్వయం ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’కు పనిచేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి ఓ పాట రాసినట్టు.. దానికి అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చినట్టు రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశారు. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు