యువతకి సందేశం

3 Mar, 2020 01:43 IST|Sakshi
బ్రహ్మానందం

‘‘రామసక్కనోళ్లు’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే కనీస బాధ్యతలను విస్మరిస్తున్న నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు మంత్రి హరీష్‌ రావు. చమ్మక్‌ చంద్ర, సలీం షేక్‌  హీరోలుగా, మేఘనా చౌదరి, షాయాజీ షిండే, బ్రహ్మానందం, నాగినీడు, చలపతి ప్రధాన పాత్రల్లో ఫహీం సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామసక్కనోళ్లు’. సునయన పరాంకుశం సమర్పణలో సతీష్‌ కుమార్‌ సాత్పడి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని మంత్రి హరీష్‌ రావు విడుదల చేశారు. సతీష్‌ కుమార్‌ సాత్పడి మాట్లాడుతూ–‘‘ఓ గ్రామంలో కొందరు పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చేసే అరాచకాలను నలుగురు కుర్రాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ చిత్రకథ. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. ‘‘ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఊటీలో సినిమా చిత్రీకరించాం’’ అన్నారు ఫమీం సర్కార్‌. ఈ చిత్రానికి  సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: జగ¯Œ

మరిన్ని వార్తలు