'ముఠామేస్త్రీ' సీక్వెల్‌లో రామ్‌చరణ్..?

9 Dec, 2015 15:39 IST|Sakshi
'ముఠామేస్త్రీ' సీక్వెల్‌లో రామ్‌చరణ్..?

బ్రూస్ లీ పరాజయంతో ఆలోచనలో పడ్డ యంగ్ హీరో రామ్చరణ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న మెగా పవర్స్టార్ ఆ సినిమా తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన చెర్రీ.. ప్రస్తుతం తనీఒరువన్ రీమేక్ను సెట్స్ మీదకు తేవాలని భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నటీనటులు ఎంపిక కొనసాగుతోంది.

ఈ సినిమా తరువాత మెగా చరిష్మాను కంటిన్యూ చేస్తూ, ఓ సీక్వెల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట మగధీరుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ముఠామేస్త్రీ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రచ్చ సినిమా ఘనవిజయం సాధించింది. అదే మ్యాజిక్ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ.

రచ్చ సినిమాతో మాస్కు నచ్చే హీరోయిజాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన సంపత్ నంది, లాంగ్ గ్యాప్ తరువాత బెంగాల్ టైగర్ సినిమా చేశాడు. రిలీజ్కు ముందునుంచే ఈ సినిమా మీద కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు సంపత్. ముఠామేస్త్రీ సీక్వెల్కు ఛోటా మేస్త్రీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా