ఎన్టీఆర్‌ దొరికేశాడా..?

10 Nov, 2017 14:17 IST|Sakshi

ప్రస్తుతం దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సినిమాను ప్రకటించిన దగ్గరనుంచి ఎన్టీఆర్‌ బయోపిక్‌ వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. అయితే వర్మ మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా రిసెర్చ్‌ చేశానని చెప్పిన వర్మ, 2018 చివరకు సినిమాను రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు వర్మ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

నిజజీవిత సంఘటనల ఆధారంగా వర్మ తెరకెక్కించే సినిమాల్లో నటీనటుల ఎంపికకు ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ముంబై ఎటాక్‌, వీరప్పన్‌ లాంటి సినిమాల కోసం వర్మ సెలెక్ట్‌ చేసుకున్న నటులు అప్పట్లో హాట్‌ టాపిక్‌ గా మారారు. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్‌ పాత్రకు ఓ నటుడ్ని సెలెక్ట్‌ చేశాడట వర్మ, ప్రస్తుతం ఆ నటుడికి తన ఆఫీస్‌ లో ఎన్టీఆర్‌ మేనరిజమ్స్‌కు సంబంధించిన ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు