'బ్రూస్ లీ'పై వర్మ సెటైర్లు!

16 Oct, 2015 18:31 IST|Sakshi
'బ్రూస్ లీ'పై వర్మ సెటైర్లు!

క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రామ్ చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్లీ' సినిమాపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 'బ్రూస్ లీ' లో రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూనే మరోవైపు సున్నిత విమర్శలు చేశారు.  ఈ సినిమాకు బ్రూస్ లీ అని పేరు పెట్టకపోయి ఉంటే రామ్ చరణ్  నటన బ్రహ్మాండంగా ఉండేది. కానీ 'బ్రూస్ లీ' అనడంతోనే చిక్కంత వచ్చిందని పేర్కొన్నారు. బ్రూస్ లీ లేని ఈ సినిమాకు ఆ పేరు  ఎందుకు పేరు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా తనకు అర్థం కాలేదని ట్వీట్ చేశారు. బాస్ (చిరంజీవి) తన 150వ సినిమా కోసం ఎందుకు 'బ్రూస్ లీ'ని ఎంచుకున్నాడో ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. చిరంజీవి 151వ సినిమాలో బ్రూస్ లీ కంటే గొప్పగా కనిపించాలని ఆశిస్తున్నానంటు ట్విట్ చేశారు.

 

మెగాస్టార్ మెగాఫ్యాన్గా, బ్రూస్ లీ పవర్ ఫ్యాన్గా చిరంజీవి 151వ సినిమా మెగా కిక్కింగ్ పవర్ పంచ్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు వర్మ  పేర్కొన్నారు. 'బాస్ 151వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? జస్ట్ అడుగుతున్నా..' అంటూ వ్యాఖ్యానించారు. బ్రూస్ లీని సినిమాలో చేర్చకపోయినట్టయితే రామ్చరణ్ బ్రూస్లీలాగే కనిపించి ఉండేవాడని అన్నారు. 'బ్రూస్ లీ' సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్లీ బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ద డ్రాగన్' చిత్రం చూశానని వర్మ పేర్కొన్నారు.