నా గదిని గర్ల్స్‌ హాస్టల్‌ చేసేశారు : వర్మ

28 May, 2019 16:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాను విద్యనభ్యసించిన సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీని సందర్శించారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఇదే గదిలో ఉండేవాడినని, దీనిని ఇప్పుడు గర్ల్స్‌ హాస్టల్‌గా మార్చారని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదిగో ఈ లవ్‌లీ గర్లే ఇప్పుడు ఈ గదిలో రూమ్‌మేట్స్‌గా ఉంటున్నారు అంటూ వారితో దిగిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నేను నిలుచుకున్న వెనకాలే శ్రీదేవి ఫొటో ఒకటి ఉండేది, దాన్ని నేనే అంటించాను అంటూ తన కాలేజీ స్మృతులను వర్మ గుర్తు చేసుకున్నారు.

మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్‌ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్‌ చేసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు