పేరుకు తగ్గట్టే పండగ..!

30 Jul, 2014 00:32 IST|Sakshi
పేరుకు తగ్గట్టే పండగ..!

 ‘‘పేరుకు తగ్గట్టే ‘పండగచేస్కో’ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. రామ్ కథానాయకునిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పండగచేస్కో. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో రామ్ ఆహార్యం, అభినయం కొత్తగా ఉంటాయి. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా ఆయన పాత్రను మలచడం జరిగింది.
 
 ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం. సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్ ఉంటుంది. నవంబర్ 15 వరకూ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. యువతరాన్ని ఉర్రూతలూగించేలా సినిమా ఉంటుంది. తమన్  సంగీతం ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: యునెటైడ్ మూవీస్.