రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

28 Oct, 2019 12:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎలా దూసుకుపోయిందో తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాములో రాముల’ సాంగ్‌ దుమ్ము రేపుతోంది. కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన ‘రాములో రాములా నన్నాగం చేసిందిరో’ ఫుల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందుకు నిదర్శనంగా ఒక టిక్‌ టాక్‌ వీడియో వేల వ్యూస్‌తో దూసుకుపోతూ క్రేజీ స్టార్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ ర‌చించగా, తమ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ ఆల‌పించారు. ఇప్పటికే యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ పాటకు సంబంధించి తాజా టిక్‌టాక్‌ వీడియో  సంచలనం సృష్టిస్తోంది.  ఈ టిక్‌ టాక్‌ వీడియోను తమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. సినిమా విడుదలకు ముందే అంచనాలను భారీగా పెంచేస్తున్న పాటలపై స్వరకర్త తమన్‌  ఫుల్‌ ఖుషీ గా ఉన్నారు. 

‘సామజవరగమన’ పాట  50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఇపుడు 'రాములో రాములా'  మాస్ సాంగ్  కూడా అదే జోరును కంటిన్యూ చేస్తోంది. 24 గంటల్లోనే 8.3 మిలియన్ల వ్యూస్  దక్కించుకుంది. ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ రాబట్టుకున్న దక్షిణాది పాటగా కొత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాదు వ్యూస్ పరంగా సామజ వరగమన పాటను రాములో రాములాపాట బీట్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుందని అంచనా. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా