డైరీ ఫుల్‌

13 Nov, 2019 02:59 IST|Sakshi

శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్‌ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్‌గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్‌గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్‌ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్‌. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్‌’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్‌ లీడ్‌ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్‌ నేపథ్యంలో ఉంటుంది.

మరిన్ని వార్తలు