కన్యక మహిమలు

25 Nov, 2014 22:44 IST|Sakshi
కన్యక మహిమలు

కన్యకాపరమేశ్వరి అమ్మవారి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’. ‘విశ్వమాత’ అనేది ఉపశీర్షిక. వాసవిగా సందీప్తి, పరాశక్తిగా రమ్యకృష్ణ నటించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. జె.ఆర్.పద్మిని, కోంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్‌గుప్త నిర్మాతలు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వాసవి చరిత్రతో పాటు, అమ్మవారి మహిమలను కూడా ఇందులో చూపిస్తున్నాం.

భక్తి ప్రధానమైన ఈ చిత్రం నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటుందని మా నమ్మకం’’ అని తెలిపారు. నేటి తరం ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడనీ, ఇలాంటి చిత్రంలో తానూ భాగమైనందుకు ఆనందంగా ఉందని రంగనాథ్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వాసూరావు, సాహిత్యం: సి.నారాయణరెడ్డి, వెనిగళ్ల రాంబాబు, ఆర్.కె.రాము.