దిస్‌ ఈజ్‌ జస్ట్‌ ద బిగినింగ్‌

5 Dec, 2019 18:22 IST|Sakshi

నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ ‘క్వీన్‌’.గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, ప్రసాద్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్‌ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్‌ డేస్‌​ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్‌లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్‌ అనిఖ ఆకట్టుకుంది.  

డిసెంబర్‌ 14న విడుదల కానున్న ఈ వెబ్‌ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్‌ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్‌ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్‌ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్‌ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్‌ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా.. ఆ సినిమాలో విలనా !

త్వరలో బ్యూటిఫుల్‌

ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా?

‘లంగ్‌ క్యాన్సర్‌.. ఐదు వారాలకు మించి’

బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు

కండోమ్‌ వాడండి.. రేప్‌లను అంగీకరించండి!

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

థాంక్యూ మహీ భాయ్‌: సింగర్‌

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

వేధింపులు చిన్న మాటా!

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిస్‌ ఈజ్‌ జస్ట్‌ ద బిగినింగ్‌

అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు

ఆన్‌లైన్‌ గ్రీకు వీరుడు హృతిక్‌!

విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం: హీరోయిన్‌

బిగ్‌బాస్‌: కొట్టుకున్నారు.. ఆపై ఏడ్చాడు!

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి