ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారు: నటి

12 Nov, 2018 08:21 IST|Sakshi

తమిళసినిమా: ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారంటూ నటి రమ్యానంబీశన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కోలీవుడ్‌లో పిజా, సేతుపతి, మెర్కూరీ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ కేరళా బ్యూటీ తాజాగా నటించిన నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా విడుదలకు సిద్ధం అవుతోంది. మాతృభాషతో పాటు కన్నడంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికిప్పుడు మలయాళంలో అవకాశాలు రావడం లేదట.

దీని గురించి రమ్యానంబీశన్‌ ఒక భేటీలో తెలుపుతూ ఇప్పుడు మహిళలకు మీటూ అనేది ఒక పెద్ద అలలా వెలుగులోకి వచ్చిందని అంది. అయితే దీని ఏడాది ముందే మలయాళ సినిమాకు చెందిన మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పింది. అయితే ఈ సంఘం ద్వారా  నటీమణులు తమ సమస్యల గురించి న్యాయమైన రీతిలో ప్రశ్నించగా అలాంటి వారిని మాలీవుడ్‌ అవకాశాలు కల్పించకుండా పక్కన పెట్టేస్తోందని చెప్పింది. ఈ అమ్మడు కోలీవుడ్‌నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. రమ్యానంబీశన్‌ తాజాగా నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సీతకాది చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. 
 

మరిన్ని వార్తలు