బావా బావమరుదుల బిజినెస్ ప్లాన్స్

14 Dec, 2016 13:34 IST|Sakshi
బావా బావమరుదుల బిజినెస్ ప్లాన్స్

ఈ జనరేషన్ యంగ్ హీరోలందరూ నటనతో పాటు నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, శర్వానంద్, రామ్ చరణ్ లాంటి హీరోలు నిర్మాతలుగా మారారు. తాజాగా మరో ఇద్దరు యంగ్ హీరోలు ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు యువ కథానాయకులు కలిసి బిజినెస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

నాగచైతన్య, రానాలు బావా బావమరుదులు అన్న సంగతి తెలిసిందే.. ఈ ఇద్దరి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి నిర్మాణ సంస్థల అండ ఉంది. అయినా వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. లో బడ్జెట్లో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించేందుకు ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. తొలి ప్రయత్నంగా కొత్త దర్శకుడితో ఓ హర్రర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు త్వరలో భారీ ఈవెంట్తో తమ నిర్మాణ సంస్థను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ యంగ్ హీరోస్.