బరిలోకి భల్లాలదేవుడి తమ్ముడు

22 Oct, 2017 13:57 IST|Sakshi

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకు పైగా హీరోలు సందడి చేస్తుంటే, నందమూరి, అక్కినేని ఫ్యామిలీల నుంచి కూడా వారసులు క్యూ కడుతున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో సినీ కుటుంబం నుంచి యంగ్ హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. నిర్మాతగా తెలుగు సినీ రంగాన్ని శాసించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్ తో పాటు, యంగ్ హీరో రానాలు టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేస్తుండగా ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో లేడీస్ టైలర్ సీక్వల్ తో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడన్న ప్రచారం జరిగినా ఆ సినిమా సుమంత్ అశ్విన్ చేశాడు. తాజాగా మరోసారి అభిరామ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. భాను శంకర్ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నాడట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు