రానా.. నీకు హ్యాట్సాఫ్‌!

13 Feb, 2020 19:35 IST|Sakshi

రానా హీరోగా ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. మానవులు-జంతువుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా అడవిలో ఉండే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తెలుగు టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 75 సెకన్ల నిడివిగల టీజర్‌లో రానా గతంలో ఎప్పుడూ కనిపించన కొత్త లుక్‌, ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అంతరించిపోతున్న మూగజీవాల రక్షకుడిగా అతడి విన్యాసాలు అభిమానులను నివ్వెరపోయేలా చేసింది. టీజర్‌లో రానా నటనకు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. 

ఇక ఇప్పటికే విడుదల చేసిని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో రానా డిఫరెంట్‌ డ్రెస్సింగ్‌, హావభావాలతో అగ్రెసివ్‌గా వావ్‌ అనిపించేలా ఉన్నాడు. రౌద్రంగా.. కన్నెర్ర చేస్తూ యుద్ధానికి సిద్ధం అంటూ శత్రుసైన్యానికి సంకేతాలు ఇస్తున్నట్టు కనిపించాడు. రానా ఫస్ట్‌ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్‌ విజేత రసూల్‌  సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. రానాతో పాటు జోయా హుస్సేన్‌, శ్రియా పిల్లావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

చదవండి:
‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’
మీ లవ్‌.. నా లక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు