రానా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌..

31 May, 2020 15:51 IST|Sakshi

లాక్‌డౌన్‌కు ముందు ల‌వ్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన హీరో రానా త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌తో ఏడ‌డుగులేసేందుకు ఎదురు చూస్తున్నాడు. "ఇట్స్ మై ల‌గ్గం టైమ్" అంటూ బ్యాచిల‌ర్ లైఫ్‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్ప‌టికే రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్ష‌న్‌తో పెళ్లి ప‌నులు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా కార‌ణంగా ఇప్ప‌ట్లో పెళ్లి తంతు పెట్టుకోరు, డిసెంబ‌ర్‌లో వివాహం జ‌రుగుతుండొచ్చు అని అంద‌రూ భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రానా తండ్రి ద‌గ్గుబాటి సురేష్ బాబు ఆగ‌స్టులోనే పెళ్లి చేసేయాల‌నుకుంటున్నార‌ట‌. (ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్‌)

ఆగ‌స్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉంద‌ని, ఆ రోజే ఈ ప్రేమ‌ప‌క్షుల‌ను పెళ్లి బంధంతో క‌లిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం. హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాలు మాత్ర‌మే హాజ‌ర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక క‌రోనా వ‌చ్చినా, ఇంకేదైనా ప్ర‌ళ‌య‌మే వ‌చ్చినా పెళ్లి ఆగేదే లేద‌ని నిఖిల్ త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వికి మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడైన విష‌యం తెలిసిందే. దీంతో రానా కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హీరో నితిన్ మాత్రం నిశ్చితార్థం జ‌రిగినా పెళ్లిని వాయిదా వేస్తూ ఇంకా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడు. (అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా