బాహు.. భళ్లా... మళ్లా! 

1 Jul, 2020 00:47 IST|Sakshi

బాహు అంటే బాహుబలి.. భళ్లా అంటే భళ్లాలదేవా. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవాగా రానా ‘బాహుబలి’ రెండు భాగాల్లో పోటీపడి నటించారు. హీరోకి దీటైన విలన్‌ అనిపించుకున్నారు రానా. ఇప్పుడు బాహు.. భళ్లా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారని టాక్‌. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రానా కనిపించేది తక్కువ సమయమే అయినా గుర్తుండిపోయే పాత్ర అవుతుందని తెలిసింది. ఈ నెల రెండో వారం నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణను హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌ కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ నేతృత్వంలో ఐదు కోట్ల ఖర్చుతో ఓ ఆస్పత్రి సెట్‌ని తీర్చిదిద్దారు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతదర్శకుడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు