రెట్రో వీరులు

29 Oct, 2017 00:21 IST|Sakshi

రెట్రో వీరులు గడియారంలో ముల్లు వెనక్కి తిరుగుతుందా? ఊహూ... గతాన్ని మళ్లీ క్రియేట్‌ చేయొచ్చా? ఊహూ! రియల్‌గా కుదరదు కానీ... రీల్‌పై కుదురుతుంది. ఎన్నేళ్లయినా ముందుకెళ్లొచ్చు...ఎన్నేళ్లయినా వెనక్కి వెళ్లొచ్చు.ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్‌లోకొందరు ‘బ్యాక్‌ టు పాస్ట్‌’ అంటున్నారు. ‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్‌’ అనే సామెత తెలుసా?దానర్థం గతమెప్పుడూబాగుంటుందని! అలాగని, భవిష్యత్తు బాగుండదని కాదు.బట్‌.. ప్రెజెంట్‌కన్నా ‘పాస్ట్‌’తెలుసుకోవడంలో ఓ కిక్కుఉంటుంది. మనవాళ్లను రెట్రో వీరులుగా చూడటంలో ఓ మజా ఉంటుంది. అందుకే...కలెక్షన్లను ముందుకుతీసుకెళ్లేందుకు గతంలోకి వెళుతున్నారు కొందరు దర్శక–నిర్మాతలు.

70 ఏళ్లు వెనక్కి రానా!
నో.. కాంప్రమైజ్‌. క్యారెక్టర్స్‌వైజ్‌గా రానా రాజీపడరు. అవసరమైతే బరువు తగ్గుతారు. పెరుగుతారు. విలన్‌గానూ నటిస్తారు. అంతెందుకు బాస్‌.. ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా ఉండే రానా అవసరమైతే పాత కాలం మనిషిలా కనిపించడానికి ‘యస్‌’ అనేస్తారు. అలా అన్నదే ‘1945’ మూవీ. బర్మాకు వలస వెళ్లిన వారి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం రానాను సుమారు 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు చిత్రదర్శకుడు సత్యశివ. 1945 టైమ్‌ అది. స్వాతంత్య్రం కూడా రాలేదు. ఆ కాలంలోకి వెళ్లి  ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రానా. అందుకే, ఆ కాలం నాటి ఆనవాళ్లు స్క్రీన్‌పై కనిపించాలని టీమ్‌ అంతా చాలా కష్టపడి సెట్‌లో స్పెషల్‌ ఎరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, లుక్స్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో కోసం 1945 నాటి బైక్, వాచ్‌లను తయారు చేయించారు. రానా ఆల్రెడీ గెడ్డం తీసేశారు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా స్వరకర్త. నాజర్, సత్యరాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొచ్చి, చెన్నైలలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆల్రెడీ సెకండ్‌ షెడ్యూల్‌ని కంప్లీట్‌ చేశారట. ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

నార్త్‌లోనూ బ్యాక్‌ టు పాస్ట్‌
బాలీవుడ్‌లోనూ డైరెక్టర్లు ‘బ్యాక్‌ టు పాస్ట్‌’ అంటున్నారు. 1948 టైమ్‌లో ఒలింపిక్స్‌లో ఫస్ట్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఇండియన్‌ హాకీ టీమ్‌ ప్లేయర్‌ బల్బీర్‌సింగ్‌ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రీమా కగ్తీ. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వచ్చే ఏడాది అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో నటించబోయే సినిమా 1950 కొరియన్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. క్రికెట్‌లో ఇండియాకు 1983లో ఫస్ట్‌ వరల్డ్‌ కప్‌ అందించిన కపిల్‌దేవ్‌ కథతో రూపొందుతోన్న సినిమాలో రణవీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్నారు. కబీర్‌ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. హీరోయిన్లలో మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో ఆలియా భట్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆలియా 1970 కాలానికి చెందిన కాశ్మీరీ అమ్మాయిగా నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్‌ వాళ్లూ తమ సినిమాల కోసం వెనక్కి వెళుతున్నారు.

వేరే దేశంలో 55 ఏళ్లు వెనక్కి!
ప్రభాస్‌... చెప్పేదేముంది? ఎక్సెప్ట్‌ ‘బాహుబలి’ మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఆల్మోస్ట్‌ ఎంతటి ట్రెండీ లుక్స్‌లో కనిపించారో... ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ, ప్రభాస్‌ను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దాదాపు 55 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ల నున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా 1960 యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. అంటే... దర్శకుడు రాధకృష్ణ నాటి యూరప్‌ లొకేషన్ల కోసం వేటడాలి. లేకపోతే సెట్స్‌ వేయించాలి. ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇంకా టైమ్‌ ఉంది. ఈలోపు సెట్స్, లొకేషన్స్‌ని ఫైనలైజ్‌ చేసేస్తారు. మరి.. ప్రభాస్‌ను రాధాకృష్ణ ఆ కాలంలోకి తీసుకెళ్లి యుద్ధం చేయిస్తారో? ప్రేమలో పడేస్తారో? చూడాలి.

గళ్ల లుంగీలో రామ్‌చరణ్‌
తెలుగువాళ్ల ట్రేడ్‌ మార్క్‌ అంటే.. ‘గళ్ల లుంగీ’. కాకపోతే సినిమాల్లో మన హీరోలు కనిపించేది ప్యాంటుల్లోనే కదా. అందుకే, మనోళ్లు ‘గళ్ల లుంగీ’ కడితే.. అభిమానులు ఈలలేసి, గోల చేసేస్తారు. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ అదే చేయబోతున్నారు. ‘ధృవ’ సినిమాలో చరణ్‌ ఎంత స్టైలిష్‌గా కనిపించారో చూశాం. కానీ, డైరెక్టర్‌ సుకుమార్‌ ‘రంగస్థలం’ సినిమా కోసం 1985 కాలంలోకి రామ్‌చరణ్‌ని తీసుకెళ్లారు. స్టైలిష్‌ హీరోను కాస్తా .. పక్కా విలేజ్‌ కుర్రాడిలా రెడీ చేశారు. గళ్ల లుంగీ, గెడ్డం, చేతిలో తువ్వాలు... టోటల్‌గా రామ్‌చరణ్‌ లుక్‌ అదిరింది. 30 ఏళ్ల క్రితం అమ్మాయిలు వేసుకున్నట్లే బిగుతుగా అల్లిన జడ, ఆ జడకు కట్టిన రిబ్బను, లంగా–ఓణీలో సమంత లుక్‌ కూడా బాగుంది. 1985ని తలపించేలా సుకుమార్‌ వేయించిన విలేజ్‌ సెట్స్‌ సూపర్‌. గోలీసోడా, పూరిళ్లు, కుండలు, ఎడ్లకావిడి.. ఇలా ఒకటేంటి ఆల్మోస్ట్‌ విలేజ్‌లో ఉండే అన్నింటినీ ఎరేంజ్‌ చేశారు. ఈ మధ్యే సెట్లో ఓ జాతర పాట తీసినట్లు బయటికొచ్చిన ఫొటో స్పష్టం చేసింది. అప్పటికాలంలో ఉండే జాతర, తిరున్నాళ్లను సినిమాలో చూడవచ్చన్న మాట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వస్తుంది.

రూట్‌ మార్చిన పూరి..!
‘బ్యాక్‌ టు పాస్ట్‌’ వెళ్లడం ఇది కొత్త కాదు. గడచిన మూడు నాలుగేళ్లల్లో ‘మనం’, ‘24’ వంటి సినిమాలు సౌత్‌లో వచ్చాయి. అయితే, ఒకేసారి ఇటు సౌత్‌ అటు నార్త్‌లో ఎక్కువ సినిమాలు ‘ఆన్‌ సెట్స్‌’లో ఉండటం విశేషం. ప్రెజెంట్‌ ట్రెండ్‌ మూవీస్‌ ఎలానూ వస్తాయి. పాస్ట్‌ని ప్రెజెంట్‌ చూపించి, ప్రేక్షకులను మెప్పించి, మంచి వసూళ్లు రాబట్టుకోవాలన్నది ఫిల్మ్‌ మేకర్స్‌ టార్గెట్‌ అయ్యుండొచ్చు.

ఫారిన్‌ లొకేషన్లు, పబ్బులు, హాట్‌ గాళ్స్‌... మారిన ట్రెండ్‌కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌లా ఉంటాయి పూరి జగన్నాథ్‌ సినిమాలు. అయితే పూరి జగన్నాథ్‌ రూట్‌ మార్చారు. 1971కి వెళ్లిపోయారు. తనయుడు ఆకాశ్‌ పూరీ కోసం ‘మెహబూబా’ పేరుతో ఆయన లవ్‌స్టోరీ తీస్తున్నారు. 1971 చెందిన ఓ యువకుడు–యువతి మధ్య సాగే ప్రేమకథ ఇది. వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. 1971 అంటే పూరి స్టైల్‌ రిచ్‌నెస్‌ కనిపించే వీలుండదు. లేటెస్ట్‌ గన్స్, వెపన్స్‌ను ఫైట్స్‌లో యూజ్‌ చేయడం పూరి మార్క్‌. ఇలాంటివి ఈ సినిమాలో ఎక్స్‌పెక్ట్‌ చేయలేం.. 1971 అంటే పిస్తోల్, రైఫిల్‌.. లాంటివి వాడాలి కదా మరి. అందులోనూ వార్‌ బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి చిట్టిపొట్టి కాస్ట్యూమ్స్‌లో హీరోయిన్‌ నెహా శెట్టిని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా షూట్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లో స్టార్ట్‌ చేశారు. హిమాలయాల్లో 18వేల అడుగుల ఎత్తులో, మైనస్‌ 7 డిగ్రీస్‌లో సినిమాను షూట్‌ చేస్తున్నారు.

– ముసిమి శివాంజనేయులు

>
మరిన్ని వార్తలు