బాహుబలి కంటే గొప్పగా...

14 Dec, 2019 00:31 IST|Sakshi
రానా

రానా హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఈ విషయంపై రానా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ‘‘ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాం. ఇలాంటి సినిమాల్లో విజువల్స్‌ బాగుండాలని ఓ యాక్టర్‌గా నేను కోరుకుంటున్నాను. అందుకే సాంకేతికపై మరింత బాగా దృష్టి పెట్టాం.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్చువల్‌ రియాలిటీ సెట్స్‌ని క్రియేట్‌ చేయాలనుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల సినిమా మొదలు కాకముందే విజువల్స్‌ ఎలా ఉంటాయో ఓ అవగాహనకు రావొచ్చు. బహుశా.. ఇండియాలో ఇలా చేస్తున్నది మా టీమే అనుకుంటాను. ఇందుకోసం ఓ త్రీడీ స్కానింగ్‌ కంపెనీతో అసోసియేట్‌ కాబోతున్నాం. ఇంకా గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. మేం అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందు ప్రీ–ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాం. అంతా సమకూర్చుకున్న తర్వాత వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని ‘బాహుబలి’ కంటే గొప్పగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు రానా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా