రాధ... రాణి నడుమ రాజు

11 Jun, 2017 00:13 IST|Sakshi
రాధ... రాణి నడుమ రాజు

నారీ నారీ నడుమ మురారి... ఆ పాట్లు ఎలా ఉంటాయో పడేవాళ్లకు బాగా తెలుసు. ఆన్‌ స్క్రీన్‌లో ఇద్దరి భామల మధ్య ఇరుకున పడే పాత్రలను చాలామంది హీరోలు చేశారు. ఇప్పుడు రానా ఇద్దరు భామల మధ్య క్రష్‌ అవుతున్నారు. తేజ దర్శకత్వంలో నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానాకు ఇద్దరు కథానాయికలు.

ఒకరు కాజల్‌ అగర్వాల్‌. మరొకరు కేథరిన్‌ థ్రెసా. ‘నేనే రాధ నేనే భార్య’ అని కాజల్‌ అంటూంటే, కేథరిన్‌ ఏమో ‘కాదు నేనే రాణి నేనే భార్య’ అంటున్నారు.  మరి... ఈ భామలలో రాజుగారిS అసలు భార్య ఎవరు? అనడిగితే... దర్శకుడు తేజ సమాధానం చెప్పేదాకా ఆగాల్సిందే! ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్‌లో హిట్టు కళ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడీ రాధా, రాణిల పరిచయంతో ఆ కళ ఇంకాస్త పెరిగిందనే చెప్పొచ్చు. సురేశ్‌బాబు, భరత్‌ చౌదరి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.