ఈ సినిమా నాకు డబుల్‌ స్పెషల్‌

20 Dec, 2019 00:33 IST|Sakshi
కాలభైరవ, రవిశంకర్, శ్రీసింహా, రితేష్‌

– కాలభైరవ

‘‘మత్తు వదలరా’ కథ మూడేళ్ల క్రితం విన్నాను. చాలా బాగుంది. యంగ్‌ టీమ్‌ ఎంతో ప్యాషన్‌తో చేసిన చిత్రమిది. చిన్న బడ్జెట్‌లో పెద్ద హిట్‌ కంటెంట్‌ మూవీ చేయడం ఇంట్రెస్టింగ్‌గా, ఎగై్జటింగ్‌గా ఉంది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా చాలా బాగుందంటారు’’ అని నిర్మాత రవిశంకర్‌ అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకునిగా, చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. కాలభైరవ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు డబుల్‌ స్పెషల్‌. నేను సంగీత దర్శకునిగా, నా తమ్ముడు శ్రీసింహా హీరోగా ఒకే సినిమాతో పరిచయం కావడం హ్యాపీగా ఉంది. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కొత్తవారితో సినిమా రిస్క్‌ అని అందరూ అనుకుంటారు. కానీ, మా నిర్మాతలు మమ్మల్ని నమ్మి ఈ సినిమా తీసినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీసింహా. ‘‘వినోదంతో కూడిన థ్రిల్లర్‌ చిత్రమిది.. కొత్తగా ఉంటుంది’’ అన్నారు రితేష్‌ రానా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు