తెలుగు 'సుల్తాన్' రానా..?

12 Jul, 2016 09:37 IST|Sakshi
తెలుగు 'సుల్తాన్' రానా..?

హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రానా. హీరో, విలన్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.., ఓ పాత్ర మీద మనసు పారేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు చేసిన మల్లయోధుల తరహా పాత్రను తాను కూడా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో అమీర్ హీరోగా తెరకెక్కిన దంగల్పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు. దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు.

కుస్తీ పోటిల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించాడు రానా. రానానే స్వయంగా చేస్తానంటే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్ లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి