‘అరణ్య’: విష్ణు విశాల్‌ మరో లుక్‌

23 Feb, 2020 14:14 IST|Sakshi

దగ్గుబాటి రానా టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్‌’ పేర్లతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రానా, ఇతర ముఖ్యతారాగణం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో పాటు టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుండగానే మరో అస్త్రాన్ని విడుదల చేసింది ‘అరణ్య’టీం. ఈ చిత్రంలోని విష్ణు విశాల్‌కు చెందిన మరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో విష్ణు ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

‘రెండున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని జాదవ్‌ ప్రియాంక్‌ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. పద్మశ్రీ అవార్డ్‌ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. కథ విని పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభుగారికి రుణపడి ఉంటాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది’అని టీజర్‌ రీలీజ్‌ సందర్బంగా రానా పైవిధంగా పేర్కొన్నాడు.  జోయా హుస్సేన్‌, శ్రియా పిల్లావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత రసూల్‌  సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశారు.

 

చదవండి:
వెరైటీ టైటిళ్లతో తేజ కొత్త చిత్రాలు.. హీరోలు వీరే 
‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’
బాలయ్య సరసన అంజలి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు