నెగటివ్‌ ఆలోచనలు సరికాదు : రణ్‌బీర్‌

24 Sep, 2017 14:12 IST|Sakshi

సాక్షి, సినిమా :  యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ - పాకిస్థాన్‌ హీరోయిన్‌ మహిరా ఖాన్‌.. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ గత కొంత కాలంగా బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అప్పట్లో ఓ ఈవెంట్‌కు లండన్‌ వెళ్లిన వీరిద్దరి మధ్య జరిగిన ఓ వీడియో బయటకు రావటం.. అందులో మహిరా ఏడుస్తూ రణ్‌బీర్‌ను ఏదో బతిమిలాడటం.. పెద్ద రచ్చే చేసింది. 

ఇప్పుడు అది చాలదన్నట్లు వీరిద్దరూ కలిసి సిగరెట్లు తాగుతున్న ఓ ఫోటో ఈ మధ్య వైరల్‌ అయ్యింది. దీంతో మహిరాను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేసేశారు. ఒకానోక టైంలో కొందరు మహిరాను ఉద్దేశించి ‘ముస్లిం అమ్మాయివి అయ్యి ఉండి సిగ్గులేకుండా ఆ బట్టలు.. చేతిలో సిగరెట్‌ ఏంటి’’ అంటూ మతపరమైన విమర్శలు కూడా చేశారు.  ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ ఓ ప్రకటన వెలువరించాడు. 

‘మహిరా నాకు గత కొంత కాలంగా తెలుసు. ఒక వ్యక్తిగా కంటే ఆమె సాధించిన విజయాలకు ఆకర్షితుడనై నేను ఆమెకు అభిమానిగా మారిపోయా. కానీ, ఆమె ఫోటోపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఫోటో ఆధారంగా ఆమెను చులకనగా చేసి కామెంట్లు చేశారు. అది మంచి పద్ధతి కాదు. ముందు ఆ నెగటివ్‌ ఆలోచనలు మానుకుని దేవుడిచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా.. సంతోషంగా గడపండి’ అంటూ రణ్‌ వీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. పైగా సిగరెట్‌ తాగడమే కాదు.. ఇలా అసహ్యించుకోవటం కూడా ఆరోగ్యానికి హానికరమేనంటూ ఓ కొటేషన్‌ కూడా ఉంచాడు. మరోవైపు సీనియర్‌ నటుడు.. రణ్‌బీర్‌ తండ్రి రిషి కపూర్‌, నటి పరిణితి చోప్రా, హీరో వరుణ్‌ ధావన్‌.. పాక్‌ నటుడు అలీ జఫర్‌ మహిరాకు సోషల్‌ మీడియాలో మద్ధతు తెలిపారు.

మరిన్ని వార్తలు