వైరల్‌ అవుతోన్న రణ్‌బీర్‌, అలియా పెళ్లి ఫోటో!

4 Sep, 2019 20:46 IST|Sakshi

ముంబై : రణ్‌బీర్‌, అలియాభట్‌.. కొంత కాలంగా వీరిద్దరూ సంవత్సరం నుంచి డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు బాలీవుడ్‌లో బాగానే వినిపిస్తూ వస్తు‍న్నాయి. అంతేగాక ఇటీవల అంబానీ కుటుంబంలో ఏర్పాటు చేసిన గణేశ్‌ చతుర్థి వేడుకల్లో వీరిద్దరు కలిసి హజరయ్యారు. నిజానికి తమ అభిమానులంతా వీరిద్దరి పెళ్లి ఎప్పుడా అని  ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.  ఇలాంటి విషయాలకు ఆజ్యం పోస్తూ వీరిద్దరికీ సంబంధించిన ఓ పెళ్లి ఫోటో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరికి  వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో అన్న సందేహం కలుగుతుంది.

వాస్తవంలోకి వెళితే  రణ్‌బీర్‌, అలీయాల ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌లో ఓ అభిమాని వీరిద్దరని ఫోటోలను ఫోటోషాప్‌లో చక్కగా ఎడిట్‌ చేసి పెళ్లి చేసుకున్నాట్లు పోస్ట్‌ చేశారు. ఇటీవలే అలియా ఓ ప్రకటనలో పెళ్లి దుస్తుల్లో అందంగా తయారై నవ వధువులా కనిపించారు. అందులోని మేల్‌ మోడల్‌ స్థానంలో రణ్‌బీర్‌ ఫోటో పెట్టి ఓ అభిమాని ఎడిట్‌ చేశారు.ఈ ఫోటోలో నిజంగా పెళ్లి చేసుకున్నట్లే కనిపించడంతో  అభిమానులు  రణ్‌బీర్‌, అలియాలకు పెళైనట్లు ఊహించుకొని ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Awesome Edit 😍😍😘❤❤❤ . . #ranbirkapoor #aliabhatt #ranbirkapoorworld #ranbirkapoorloverz #ranbirkapoorfans #bollywood #ranbir_kapoor #ranbirian_amrin #ranbirkapoor143 #neetukapoor #rishikapoor #ridhimakapoor #brahmastra #ayanmukerji #ranbirkapoormagic #ranbirkapoorloverz #ranbirkapoorfan #ranbirkapoorlove #anushkasharma #karanjohar #shahrukhkhan #aedilhaimushkil #ranbiralia #ranbirkapoor143

A post shared by SONA❤ (@ranbir_kapoor_my_life_line) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా