ఈ ఏడాదే ఆ హీరో హీరోయిన్‌ పెళ్లి!?

7 Feb, 2020 14:39 IST|Sakshi

బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌గా వార్తల్లో నిలుస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌లు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు  బీ-టౌన్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో అలియా, రణ్‌వీర్‌లు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా  ఈ ఏడాది డిసెంబర్‌ 4న విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ జంట కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్‌ భాగంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. ఈ క్రమంలో ‘బ్రహ్మస్త్ర’ విడుదల తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ లవ్‌బర్డ్స్‌ పెళ్లికి ఇరుకుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయని... పెళ్లి తేదిని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా అలియా.. రణ్‌బీర్‌ కుటుంబంతో కలిసి వివిధ కార్యక్రమాలకు హజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్మాన్‌ జైన్‌, అనిషా మల్హోత్రాల పెళ్లికి రణ్‌బీర్‌, ఆయన తల్లి నీతూతో కలిసి అలియా హాజరయ్యారు.

లండన్‌లో ఇల్లు కొనుక్కున్నా: హీరోయిన్‌

అదే విధంగా ఓ ఇంటర్వ్యూలో అలియా తండ్రి మహేష్‌ భట్‌ రణ్‌బీర్‌ అంటే తనకు ఇష్టం అని చెప్పిన సంగతి తెలిసిందే. ‘అవును వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అందులో దాచాల్సిన విషయం లేదు. నాకు రణ్‌వీర్‌ అంటే చాలా ఇష్టం. అతను చాలా మంచి వ్యక్తి. ఇక వారి బంధాన్ని ఎలా గుర్తించాలనుకుంటున్నారో వాళ్లే తెల్చుకోవాల్సిన విషయం. ఒకవేళ అది పెళ్లి వరకు వెళ్లుతుందా లేదా అనేది వారే గుర్తించాలి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇది వరకే రణ్‌వీర్‌, అలియాలు పెళ్లి చేసుకుంటున్నారనే వచ్చిన వార్తలను ఈ జంట కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి కూడా ఈ వార్తలను వీరు కొట్టిపారేస్తారో లేక నిజం చేస్తారో డిసెంబర్‌ వరకు వేచిచూడాల్సిందే. కాగా రణ్‌బీర్‌ కపూర్‌ గతంలో దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా