ఆనందానికి ముహూర్తం ఫిక్స్‌

17 Jan, 2018 00:54 IST|Sakshi

చిట్టిబాబు జోరు చూశారా? నీళ్లల్లో చిందులేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు కదూ. ఇంతకీ ఇంత ఆనందం దేనికి? మహాలక్ష్మి తన లవ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అది తెలుసుకోవడానికి టైమ్‌ ఉంది. ముందు చిట్టిబాబు ఫ్యాన్స్‌కి ఓ స్వీట్‌ న్యూస్‌.

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఎర్నేనీ నవీన్,  చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న చిత్రం‘రంగస్థలం’. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పేరు చిట్టిబాబు. హీరోయిన్‌ సమంత పాత్ర పేరు మహాలక్ష్మీ అని టాక్‌. ‘‘ఈ నెల 24న సాయంత్రం 4 గంటల 15నిమిషాలకు ‘రంగస్థలం’ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నాం’’ అని చిత్రబృందం అధికారికంగా ఎనౌన్స్‌ చేసింది. అంటే.. చిట్టిబాబు అభిమానుల ఆనందానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారన్నమాట. మార్చి 30న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు