హృతిక్‌ సోదరి కంగనాను సాయం కోరుతుంది : రంగోలి

19 Jun, 2019 11:37 IST|Sakshi

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌, హృతిక్‌ రోషన్‌ల మధ్య వచ్చిన విభేదాల గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు హృతిక్‌ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు వీరిద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈక్రమంలో కంగన సోదరి రంగోలి సంచలన విషయాలు వెల్లడించారు. హృతిక్‌ సోదరి సునైనాను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారని.. సాయం కోసం ఆమె కంగనకు ఫోన్‌ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు రోషన్‌ కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు రంగోలి.

‘హృతిక్‌ సోదరి సునైనా ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దాంతో అతన్ని మర్చిపోవాలంటూ సునైనాను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ పోలీసు అధికారిని ఇంటికి పిలిపించి మరి సునైనాకు వార్నింగ్‌ ఇప్పించారు. ప్రస్తుతం సునైనా పరిస్థితి తల్చుకుంటే చాలా బాధగా ఉంది. తన ఇంట్లోనే ఆమె నరకం అనుభవిస్తున్నారు. సాయం కోసం కంగనకు ఫోన్‌ చేసింది. అయితే సునైనాకు ఎలా సాయం చేయాలో కంగనకు తెలీడంలేదు. అందుకే ఈ విషయాలన్నీ ట్విటర్‌ వేదికగా బయటపెడుతున్నాను’ అన్నారు రంగోలి.
 

అంతేకాక ‘సునైనా భద్రత కూడా మాకు ముఖ్యమే. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్‌ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ రంగోలి వరుస ట్వీట్స్‌ చేశారు. గతంలో సునైనాకు, తనకు మంచి స్నేహం ఉందని కంగన వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ మధ్యకాలంలో సునైనాకు తన కుటుంబంతో ఓ విషయంలో గొడవ జరిగింది. దాంతో కంగన హృతిక్‌ వివాదంలో సునైనా తన సోదరుడు హృతిక్‌దే తప్పంటూ ట్విటర్‌ వేదికగా కంగనాకు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు