ఆడిష‌న్స్‌కి ర‌ణ్‌వీర్‌సింగ్ ఎలా వెళ్లాడో చూడండి

14 Jul, 2020 16:19 IST|Sakshi

ర‌ణ్‌వీర్ సింగ్..ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరో. కానీ ఈ గుర్తింపు అత‌నికి అంత సుల‌భంగా ఏం ద‌క్క‌లేదు. ఎన్నో ఆడిష‌న్స్‌కి వెళ్లి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. మొద‌ట్లో చిన్నా చిత‌కా పాత్ర‌లే ద‌క్కాయి. కానీ ఏదో ఒక‌సారి అదృష్టం త‌లుపుత‌డుతుంది అంటారు క‌దా..బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో ర‌ణ్‌వీర్ కెరియ‌ర్ మలుపు తిరిగింది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోనంత‌గా స్టార్ హీరో స్థాయికి చేరాడు. ఆ సినిమాకి సంబంధించి ర‌ణ్‌వీర్ ఆడిష‌న్ వీడియో క్లిప్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా  కాస్టింగ్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన భూమి ఫ‌డ్నేక‌ర్ తాజాగా ర‌ణ్‌వీర్‌ను మొద‌ట ఆడిష‌న్స్‌కి తీసుకుంది తానేన‌ని అప్ప‌టి అనుభ‌వాల‌ను పంచుకుంది.  (ఆ రోజులు చాలా ప్రత్యేకం: నటి)

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ 2010లో  నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాండ్ బాజా బ‌రాత్. ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఆడిష‌న్ స‌మ‌యంలో వైట్ టీ ష‌ర్ట్ వేసుకొని చెప్పిన డైలాగ్ ప్ర‌స్తుతం నెట్టింట్ వైర‌ల్ అవుతోంది.  ఈ సినిమా త‌ర్వాత లేడీస్ వ‌ర్సెస్ రికీ బ‌హ్ల‌, గల్లీ బాయ్, సింబా, పద్మావత్ వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం క‌పిల్ దేవ్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 83 సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. 

Ranveer had to go through multiple auditions to land the role of Bittoo Sharma in Band Baaja Baraat. Swipe to see what Bhumi Pednekar, then casting director has to say about his audition!! 😍😍

A post shared by ranveersinghera 🧚✨ (@ranveersinghera) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా