తనని క్షమించు.. దీపికా ఇంట్లో ఉంది అందుకే: అజయ్‌

3 Mar, 2020 12:02 IST|Sakshi

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో, ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘సూర్య వంశీ’ సినిమా ట్రైలర్‌ నిన్న(సోమవారం) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు హీరో అజయ్‌ దేవగన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా నిన్న జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి రణ్‌వీర్‌ 40 నిమిషాలు లేటుగా వచ్చాడు.

దీంతో అక్కీ, రణ్‌వీర్‌ను క్రమశిక్షణ లేదంటూ... గుంజీలు తీయిస్తూ సరదాగా ఆటపట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అక్షయ్‌.. ‘రణ్‌వీర్‌తో గుంజీలు తీయుస్తూ.. 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా గుంజీలు తీయాల్సిందే’ అని అనడంతో వెంటనే అజయ్‌ దెవగన్‌ ‘పాపం క్షమించు.. తన భార్య ఇంట్లో ఉంది అందుకే’ అని చెప్పాడు. ఈ వీడియోను చూసిన రణ్‌వీర్‌ భార్య, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె  ‘భార్య ఇంట్లో ఉంది.. కానీ సమయానికి వస్తుంది’ అని ఫన్నీగా కామెంటు పెట్టారు. 

అక్షయ్ ఔదార్యం.. కోటిన్నర విరాళం

#ranveersingh gets punishment from Discipline King #akshaykumar who calls press at six in the morning for interviews 😜🙈 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

కాగా.. బాలీవుడ్‌ పరిశ్రమలో అక్కిని క్రమశిక్షణకు మారుపేరుగా అందరూ అంటుంటారు. ఎందుకంటే అక్కీ షూటింగ్‌లో నిబద్ధత పాటిస్తూ తగిన సమయంలో పనిని పూర్తి చేసుకుంటాడని చాలా సందర్బాల్లో తన సహ నటి, నటులు ప్రశంసిస్తుంటారు. కాగా నిన్న విడుదలైన ‘సూర్యవంశీ’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు రోహిత్‌ శెట్టి ఇదివరకే అజయ్‌ దేవగన్‌తో ‘సింగం’, ‘సింగం రిటర్న్స్‌’, రణ్‌వీర్‌ ‘సంబ’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను మార్చి 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు