అతను భగవంతుని ముద్దుబిడ్డ!

11 May, 2014 22:59 IST|Sakshi
అతను భగవంతుని ముద్దుబిడ్డ!

‘‘అశాశ్వతం అనుకున్న విషయాలకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వను’’ అంటున్నారు దీపికా పదుకొనె. ఆమె చెబుతున్నది జయాపజయాల గురించి. ఆ సంగతి అలా ఉంచితే... ‘రామ్‌లీలా’కి మీకంటే ముందు కరీనా కపూర్‌నే కథానాయికగా అడిగారు.. తను కాదన్నాకే సంజయ్‌లీలా భన్సాలీ మిమ్మల్ని అడిగారట కదా? అనంటే - ‘‘సంజయ్‌జీ ఈ సినిమా గురించి చెప్పగానే, వదులుకుంటే మాత్రం బంగారంలాంటి అవకాశం పోగొట్టుకున్నట్లే అనిపించింది.

అందుకే ఒప్పుకున్నా. నాకన్నా ముందు ఈ సినిమా కోసం ఎవర్ని అడిగారన్నది నాకనవసరం. వదులుకున్నవాళ్లది దురదృష్టం. ఒప్పుకోవడం నా అదృష్టం’’ అని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో మీకు బాగా దగ్గరైన రణ్‌వీర్ సింగ్ గురించి నాలుగు మాటలు అన్నప్పుడు - ‘‘తన చుట్టూ ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు రణ్‌వీర్. అందరితోనూ స్నేహంగా ఉంటాడు. మంచీ చెడూ రెంటికీ సమానంగా స్పందిస్తాడు. ఉన్నది ఒకే ఒక్క జీవితం కాబట్టి ఆనందంగా సాగించాలన్నది తన ఆశయం. ఇలాంటి వ్యక్తులు ఆ భగవంతుడి ముద్దుబిడ్డలేమో అనిపిస్తుంటుంది’’ అని చెప్పారు.