నటరాజ్‌ షాట్‌లో అచ్చం కపిల్‌..!

11 Nov, 2019 17:30 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో రన్‌వీర్‌సింగ్‌ తన సినిమాల్లోని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో, దర్శకుడు కబీర్‌ సింగ్‌ తెరకెక్కీస్తున్న ‘83’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కపిల్‌ అల్‌టైమ్‌ ఫెవరెట్‌ నటరాజ్‌ షాట్‌ను ఆడుతున్నట్టు పోస్‌తో ఉన్న ఫోటోను రన్‌వీర్‌ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కపిల్‌దేవ్‌ ‘నటరాజ్‌ షాట్‌’ పోస్‌ పెట్టిన రన్‌వీర్‌ తీరుపై పలువురు అభిందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరింది.

ఈ ఫోటోలో రన్‌వీర్‌ అచ్చంగా అలనాటి కపిల్‌దేవ్‌ నటరాజ్‌ షాట్‌ కొడుతున్న తీరు తన పోస్‌లో మరోసారి క్రికెట్‌ అభిమానుల కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నారు. రన్‌వీర్‌ నాటరాజ్‌లా నిలబడినతీరు, జట్టు, షాట్‌ కొడుతున్న వ్యక్తం చేసే ముఖకవలికలు అచ్చంగా కపిల్‌దేవ్‌లా ఉన్నాయి. దీంతో బాలీవుడ్‌ నటుడు ఆయూష్మాన్ ఖురానా ఈ ఫోటక్షపై స్పందిస్తూ.. ‘మరో సారి చాంపియన్‌’ అంటూ చప్పట్లు కొడుతున్నఎమోజీని పెట్టారు. నీనాగుప్తా, చైతన్య శర్మలు..‘నిన్ను అభినందించకుండా ఉండలేము.. వావ్‌..’ అంటూ.. కామెంట్‌ చేశారు. అదేవిధంగా కపిల్‌దేవ్‌ కూడా స్పందించి ‘శెభాష్ రన్‌వీర్‌’ అంటూ.. రిట్వీట్‌ చేశారు. రన్‌వీర్‌కు కోస్టార్‌గా నటిస్తున్న సాకిబ్ సలీం స్పందిస్తూ..‘బాంబ్‌’ అంటూ కామెంట్‌ చేశారు. ప్రముఖులతో పాటు నెటిజన్లు రన్‌వీర్‌ అచ్చం కపిల్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ‘83’  చిత్రం కోసం రణ్‌వీర్‌ చాలా హర్డ్‌వర్క్‌ చేస్తున్నాడని, అచ్చం కపిల్‌దేవ్‌లా కనిపించడం కోసం రణ్‌వీర్‌ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు కబీర్‌ సింగ్‌ ఇటీవలే  ఓ ఇంటర్యూలో తెలిపాడు. కాగా రణ్‌వీర్‌ నటించిన గల్లీబాయ్‌ మూవీ ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

NATRAJ SHOT 🏏 #RanveerAsKapil 🇮🇳 @therealkapildev @kabirkhankk @deepikapadukone @sarkarshibasish @mantenamadhu #SajidNadiadwala @vishnuinduri @reliance.entertainment @fuhsephantom @nadiadwalagrandson @vibrimedia @zeemusiccompany

A post shared by Ranveer Singh (@ranveersingh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా