ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్‌వీర్‌

16 Oct, 2019 19:39 IST|Sakshi

భార్య ఏం చేసినా భర్తకు ముద్దుగానే కనిపిస్తుంది. ఈ పదం ప్రస్తుతం బాలీవుడ్‌లో రొమాంటిక్‌ కపుల్‌గా పేరు పొందిన రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకోన్‌కు చక్కగా సరిపోతుంది. వీరిద్దరూ తమకు చెందిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఒకరు పోస్ట్‌ చేసిన ఫోటోలపై మరోకరు కామెంట్లు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపికా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఫోటోషూట్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ ఫోటోపై భర్త రణ్‌వీర్‌ స్పందించారు.

‘ఆ చూపులకు అర్థం నాకు తెలుసు. ఇప్పటికైనా ఇంటికి వస్తారా’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. అయితే రణ్‌వీర్‌ ఇలా కామెంట్‌ పెట్టడానికి కారణం ఇందులో దీపికా కెమెరావైపు కాస్తా కోపంగా ఉన్నట్లు ఫోజ్‌ ఇయడమే. అంతేగాక ఇలా దీపికా ఫోటోలపై స్పందించడం రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా దీపికా పెట్టిన అనేక పోస్ట్‌లకు సరదాగా కామెంట్‌ పెడుతూ వచ్చాడు. కాగా పెళ్లికి ముందు మూడు సినిమాలలో కలిసి నటించిన దీప్‌వీర్‌ వివాహానంతరం కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ‘83’ సినిమాలో భార్యభర్తలుగా తెరమీద కనిపించనున్నారు. 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం వెనక కృషి చేసిన లెంజడరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. .

@harpersbazaarus Photographer: @david_roemer Fashion Editor/Stylist: @carrielauren Hair: @earlsimms2 Makeup: @naokoscintu Nails: @robbietomkins Author: @whatisnojan

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

మరిన్ని వార్తలు