15 నిమిషాల కోసం 5 కోట్లు!

26 Mar, 2018 14:22 IST|Sakshi

ముంబై : పద్మావత్‌ సినిమా విజయంతో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఆనందంలో మునిగితేలుతున్నాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీగా ప్రేక్షకులను అలరించిన రణ్‌వీర్‌ ప్రస్తుతం గల్లీ బాయ్‌, టెంపర్‌ రీమేక్‌ సింబా, '83 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్‌ 2018 ప్రారంభ వేడుకల్లో పలువురు బాలీవుడ్‌ నటులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రణ్‌వీర్‌ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఎందుకంటే కేవలం 15 నిమిషాల పాటు సాగనున్న ప్రదర్శనకు ఏకంగా రూ. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట నిర్వాహకులు. రణ్‌వీర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దృష్ట్యా భారీ మొత్తం చెల్లించేందుకు కూడా వారు వెనకాడటం లేదని ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది. ప్రస్తుతం గల్లీ బాయ్‌ షూటింగ్‌లో ఉన్న రణ్‌వీర్‌ సింగ్‌ డాన్స్‌ రిహార్సల్‌ కోసం విరామం తీసుకున్నాడట.

ఏప్రిల్‌ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ వేడుకల్లో రణ్‌వీర్‌తో పాటు.. పరిణీతి చోప్రా, వరుణ్‌ ధావన్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌లు కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు