బిజీ బిజీ

24 Mar, 2019 02:18 IST|Sakshi
రాశీఖన్నా

అటు ప్రమోషన్స్‌ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ  జంటగా ‘స్కెచ్‌’ ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్‌ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌) సినిమా ప్రమోషన్స్‌ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్‌ సేతుపతి సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ కూడా చెన్నైలో స్టార్ట్‌ కానుంది.

అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కోసం చెన్నై నుంచి రాశీ సూట్‌ కేస్‌ సర్దుకుని వేరే లొకేషన్‌లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్‌ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు