రెట్రో బర్త్‌డే పార్టీ

2 Dec, 2018 03:15 IST|Sakshi
రాశీ, రామ్, లక్ష్మీ మంచు, రకుల్, సాయిధరమ్‌

ప్రతి బర్త్‌డేకి మనం కొంచెం ముందుకెళ్తుంటాం. అంటే వయస్సులో. కానీ ఈ బర్త్‌డేకి రాశీఖన్నా వెనక్కి వెళ్లారు. ఒక సంవత్సరం తగ్గిపోయిందా? అంటే కాదు.. ఏకంగా 20, 30 ఏళ్లు వెనక్కి. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో సెలబ్రేట్‌ చేసుకుంటారు రాశీ. ఈ ఏడాది పార్టీ థీమ్‌ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నట్టు. పాత క్యాసెట్లు, టెలిఫోన్, టీవీలు డెకరేట్‌ చేసి పార్టీ చేసుకున్నారామె.  గురువారం రాశీ ఖన్నా బర్త్‌డే. ప్రతి సంవత్సరం స్కూల్‌ ఫ్రెండ్స్‌ నుంచి, ప్రస్తుతం ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో సహా అందర్నీ ఆహ్వానించి సెలబ్రేట్‌ చేసుకుంటారు.  మొన్న జరిగిన రాశీ బర్త్‌డే పార్టీలో కొన్ని ఫోటోలు. ఈ పార్టీలో రకుల్, మంచు లక్ష్మీ, రామ్, సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్, అల్లు శిరీష్, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు