‘16వ ఏటనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

23 Nov, 2019 10:32 IST|Sakshi

కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదిగిన నటి రాశీఖన్నా. తెలుగు, హిందీ, కన్నడం, తమిళం భాషా చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోందీ బ్యూటీ. ఇలా ఏదో ఒక భాషలో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఈ బ్యూటీ కోలీవుడ్‌కు ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో దిగుమతి అయిన విషయం తెలిసిందే. అందులో ప్రధాన పాత్రలో నయనతార నటించినా ఈ అమ్మడుమంచి గుర్తింపునే తెచ్చుకుంది. తరువాత వరుసగా జయంరవితో అడంగమరు, విశాల్‌ సరసన అయోగ్య వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ నాయకిగా ముద్రవేసుకుంది. విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేసిన సంఘతమిళన్‌ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. 

ఈ సందర్భంగా రాశీఖన్నా ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం కమర్శియల్‌ కథా పాత్రల్లో నటిస్తున్నా, మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో నటించాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. గ్లామర్‌ విషయంలోనూ తనకంటూ హద్దులు ఉన్నాయని చెప్పింది. అందుకే గ్లామరస్‌ పాత్రల్లో నటించమని కొందరు దర్శకులు ఒత్తిడి చేసినా ఆ పాత్రల్లో నటించడానికి నిరాకరించినట్లు తెలిపింది. ప్రస్తుతం కమర్శియల్‌ కథా పాత్రల్లో నటిస్తున్నా, భవిష్యత్‌లో మంచి సందేశాత్మక కథా పాత్రల్లో నటిస్తానని చెప్పింది. అలా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగా ఎదగాలని ఆశిస్తున్నట్లుందీ భామ. అందరూ డేటింగ్‌ గురించి అడుగుతున్నారని, తాను 16వ ఏటలోనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశానని చెప్పింది. ఆ కుర్రాడి వయసు అప్పుడు 16 ఏళ్లేనని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో సైతాన్‌ కా బచ్చా అనే చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే తెలుగులో మాత్రం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

సినిమా

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!