అందరూ కనెక్ట్‌ అవుతారు

15 Dec, 2019 00:42 IST|Sakshi
రాశీఖన్నా

సాయి తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఎస్‌కేయన్‌ సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు...

► ఈ చిత్రంలో రాజమండ్రికి చెందిన టిక్‌ టాక్‌ సెలబ్రిటీ ఏంజిల్‌ అర్ణా  పాత్ర చేశాను. మొదట్లో నాకు టిక్‌ టాక్‌ అంటే తెలియదు. ఈ కథ వింటున్నప్పుడు భయం వేసింది. ఏంజిల్‌ అర్ణా ఏంటి? టిక్‌ టాక్‌ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. ఆ తర్వాత నేను టిక్‌ టాక్‌ యాప్‌ను నా మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాను. ఆ తర్వాత టిక్‌ టాక్‌ ఫన్‌ తెలిసింది. టిక్‌ టాక్‌పై సెటైరికల్‌గా నా పాత్ర ఉండదు. నా క్యారెక్టర్‌కు అందరూ బాగా కనెక్ట్‌ అవుతారు.

► రియల్‌లైఫ్‌లో నాకు చాలా సిగ్గు. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు. కొంతమంది నా ఫ్రెండ్స్‌లో టిక్‌ టాక్‌ చేసేవారు ఉన్నారు. క్యారెక్టర్‌ కోసం కొంతమంది టిక్‌ టాక్‌ సెలబ్రీటీలను కూడ కలిశాను.  ‘జిల్‌’ సినిమా తర్వాత నేను బబ్లీ క్యారెకర్ట్‌ చేసింది ఈ సినిమాలోనే.

► సాయితేజ్‌ మంచి కో స్టార్‌. పాత్రకు నేను న్యాయం చేయగలనని దర్శకులు మారుతిగారు నన్ను నమ్మారు. సెట్‌లో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. చాలా హ్యూమరస్‌గా ఉంటారు.

► ఈ సినిమా కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను.

► నేను హీరోయిన్‌గా నటించిన ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వారం గ్యాప్‌లో విడుదల అవుతున్నాయి. వీటిని నేను ప్లాన్‌ చేయలేదు. విడుదలైన ‘వెంకీమామ’ చిత్రంలో నేను పోషించిన హారిక పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. హారిక లాంటి పాత్ర నేను ఇంతవరకు చేయలేదు.

► ఈ చిత్రానికి నేను డబ్బింగ్‌ చెప్పలేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రానికి నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాను. కథా చర్చలు జరుగుతున్నాయి. నా తర్వాతి చిత్రాల గురించి త్వరలో వెల్లడిస్తాను.

మరిన్ని వార్తలు