రష్మీ ఫైట్‌ చేస్తే...

8 Aug, 2018 01:07 IST|Sakshi

జై, రష్మీ గౌతమ్‌ జంటగా జానీ దర్శకత్వంలో యూ అండ్‌ ఐ సమర్పణలో ఎస్‌ జై ఫిలిమ్స్‌ పతాకంపై  రూపొందిన సినిమా ‘అంతకు మించి’. సతీష్, ఎ. పద్మనాభరెడ్డి, జై నిర్మించారు. భాను, కన్నా సహ నిర్మాతలు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీ దర్శకుడు అజయ్‌ భూపతితో ఎనౌన్స్‌మెంట్‌ చేయించారు చిత్రబృందం. ఈ సందర్భంగా అజయ్‌ భూపతి మాట్లా డుతూ– ‘‘ట్రైలర్, రొమాంటిక్‌ సీన్స్‌ బాగున్నాయి. ఈ సినిమా నిర్మాత కమ్‌ హీరో జై చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

‘దర్శకుడు సుకుమార్‌గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. రష్మిగారు చాలా బాగా నటించారు. జై అనుభవం ఉన్న నటుడిలా యాక్ట్‌ చేశాడు’’ అన్నారు జానీ. ‘‘అంతకుమించి’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూశాక ఆడియన్స్‌కు అర్థం అవుతుంది’’ అన్నారు జై. ‘‘అందరి ఎఫర్ట్‌ ఈ ‘అంతకు మించి’ సినిమా. నిర్మాతల ముఖాల్లో నవ్వు కనబడితే తృప్తిగా ఉంటుంది. ఈ చిత్రం నిర్మాతల ముఖాల్లో ఆ నవ్వు చూశా. హీరో జైకి మంచి టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉంది. ఈ సినిమాలో నేను డూప్స్‌ లేకుండా స్టంట్స్‌ చేశా’’ అన్నారు రష్మీ గౌతమ్‌. అజయ్‌ ఘోష్, టిఎన్‌ఆర్, మధునందన్, హర్ష నటించిన ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు