సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..

29 Dec, 2019 20:39 IST|Sakshi

జబర్దస్త్‌ నటుడు సుధీర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌. ఈ చిత్రంలో సుధీర్‌ సరసన హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన సాఫ్‌వేర్‌ సుధీర్‌ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్‌, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్‌ సెలబ్రిటీలు వారికి కాల్‌ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

లైవ్‌లో సర్‌ప్రైజ్‌ కాల్‌ చేసిన రష్మీ.. ధన్య, సుధీర్‌లకు కంగ్రాట్స్‌ చెప్పారు. ట్యాలెంట్‌ అనేది వృథా కాదనే దానికి సుధీర్ నిదర్శనమని అన్నారు. టీవీ నుంచి బిగ్‌​ స్కీ ట్యాలెంట్‌ పరిచమవ్వడం మంచి పరిణామని అన్నారు. ప్రస్తుతం హాలిడే వెకేషన్‌లో ఉన్నానని.. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. సుధీర్‌ నవరసాలు పండించడంలో దిట్ట అని చెప్పిన రష్మీ.. త్వరలోనే సుధీర్‌లోని అన్ని కోణాలు చూస్తారు. ఈ సందర్భంగా సుధీర్‌, రష్మి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి..  సుధీర్‌ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు.

అలాగే లైవ్‌ షోకు ఫోన్‌ చేసిన రామ్‌ప్రసాద్‌.. సుధీర్‌ను ఆటపట్టించాడు. తనదైన శైలిలో ఆటో పంచ్‌లు విసిరాడు. సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదని సుధీర్‌ చెప్పారు. చాలా మంది ఫోన్‌లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే క్షమించాలన్న సుధీర్‌.. మరో మంచి సినిమాతో ముందుకు వస్తానని అన్నారు.  ఈ సినిమాకు అనుకున్న దానికన్నా పెద్ద హిట్‌ అయిందన్న ధన్య.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు