నువ్వు పాకిస్తాన్ వెళ్లిపో : రష్మీ ఫైర్‌

16 Feb, 2019 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్‌ స్ట్రైక్‌ 2 జరపాల్సిందేనని యావత్‌ భారత్‌ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్‌ దుశ్చర్యపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బుల్లితెర యాంకర్‌ రష్మీగౌతమ్‌ ట్విటర్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లోనే ఉంటూ పాక్‌ మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేశారు. పుల్వామా దాడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధును సైతం ఈ బుల్లితెర యాంకర్‌ వదిలి పెట్టలేదు. ‘దేశ విభజన సమయంలోనే పాక్‌ వైపుకి వెళ్ళాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సిద్ధూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( చదవండి :  ‘సిద్ధూని తీసేయకపోతే చూడం’)

పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ షోయబ్‌ హఫీజ్‌ అనే నెటిజన్‌ చేసిన కామెంట్‌కు రష్మీ గౌతం ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. ’ అని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్‌పై కూడా ఘాటుగానే కామెంట్‌ చేశారు. ‘ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ నాకొడుకులను ఏరి పారెయ్యాలి’.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. (చదవండి: సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు