రష్మికా మజాకా

16 Jul, 2019 06:28 IST|Sakshi

సినిమా: విజయాల ప్రభావం ఎలా ఉంటుందో నటి రష్మిక మరోసారి రుజువు చేసింది. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ కన్నడ బ్యూటీ తెలుగు చిత్రం ‘గీత గోవిందం’ చిత్రానికి ముందు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కన్నడంలోనూ అప్‌కమింగ్‌ హీరోయినే. అంతే కాదు అప్పటికే ప్రేమ, బ్రేకప్‌లతో మునిగితేలిన రష్మిక ఆ విధంగానూ వార్తల్లోకెక్కింది. తెలుగు చిత్రం గీతగోవిందంతో అనూహ్య విజయాన్ని సాధించడంతో రష్మిక దశ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడామె టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌. నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్‌ వంటి మల్టీస్టారర్‌ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించి మరింత పాపులర్‌ అయింది. తాజాగా మరోసారి విజయ్‌ దేవరకొండతో కలిసి డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటించింది. నిర్మాణ కార్యక్రమాలను పేర్తి చేసుకున్న ఈ చిత్రంపైనా మంచి అంచాలు నెలకొన్నాయి. అంతే కాదు రష్మిక పేరు కోలీవుడ్‌లో సైతం మారుమ్రోగుతోంది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తూ తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇక్కడ హిట్‌ అందుకోవాల్సి ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. విజయ్‌ 64వ చిత్రంలో రష్మిక, రాశీఖన్నా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ తక్కువ కాలంలోనే తన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడిందట. పారితోషకాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేసేసిందట. మొదట్లో రూ.40 లక్షలు పారితోషకాన్ని పుచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రూ.80 లక్షలకు పెంచేసిందనే టాక్‌ సినీవర్గాల్లో గరం గరంగా మారింది. సాధారణంగా తెలుగు, తమిళ చిత్రాలకంటే కన్నడ చిత్రాల బడ్జెట్‌ తక్కువగానే ఉంటుంది. కాగా కన్నడంలోనే రష్మిక నటిస్తున్న చిత్రానికి రూ.60 లక్షలు డిమాండ్‌ చేసిందట. దీంతో వామ్మో రష్మిక అంటున్నారట కన్నడ సినీ వర్గాలు. కాగా పారితోషకం పెంచడం గురించి మీడియా ప్రశ్నించగా మీరంతా మీడియాల్లో పని చేస్తున్నారు.. కొంత కాలం తరువాత  జీతాలు పెంచాలని, పదోన్నతి పొందాలని ఆశించరా? తానూ అదే విధంగా పారితోషకం పెంచడంతో తప్పేంటి అని ఎదురు ప్రశ్నించి విలేకరుల నోళ్లు మూత పడేలా చేసింది. నటిగా ఇప్పుడు తన స్థాయి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా పారితోషకాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు రష్మిక నిర్మొహమాటంగానే చెప్పేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు కోలీవుడ్‌లో  దళపతి విజయ్‌కు జంటగా నటించే అవకాశం ఖాయం అయితే ఇంకెంత పారితోషకాన్ని డిమాండ్‌ చేస్తుందో చూడాలి. ఇప్పుడే రష్మికానా మజాకా అంటున్నారు సినీ వర్గాలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...