మేమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: రష్మిక

26 Dec, 2019 08:51 IST|Sakshi

సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ ప్రేమలు, విడిపోవడాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే సినిమాగ్లామర్‌ ప్రపంచం కాబట్టి కాస్త ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అలా ఇప్పుడు మాతృభాష కన్నడంలోనే కాదు, తెలుగు, తమిళం, తాజాగా హిందీ భాషల్లోనే పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందనా. ఈ అమ్మడు టాలీవుడ్‌లో గీతగోవిందం చిత్రంతో అనూహ్యంగా క్రేజ్‌ పొందింది. అలా రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌ అయ్యిందనే చెప్పాలి. ఇక డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ముఖ్యంగా కోలీవుడ్‌, టాలీవుడ్‌లో రష్మిక మాత్రం చాలా పాపులర్‌ అయ్యింది. (చదవండి: రష్మిక కలలు చాలా పెద్దవి)

తాజాగా బాలీవుడ్‌ కాలింగ్‌ మోగింది. అదే విధంగా తెలుగులో స్టార్‌ హీరోలతో జతకట్టేస్తోంది. కాగా రష్మిక నిజ జీవితం విషయానికి వస్తే తన  సహ నటుడితో లవ్‌లో పడి ఆ తరువాత పెళ్లి వరకూ వెళ్లి దాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని ఇటీవల తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అవును తాను ప్రేమలో పడ్డాను. పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే తానెందుకు పెళ్లిని రద్దు చేసుకున్నానంటే అని కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌ శెట్టితో తనకు నిశ్చితార్థం జరిగిందని, అయితే తనకు కాబోయే భర్త సినిమా రంగానికి చెందిన వాడు కాకూడదని తాను భావించానంది.

అయితే రక్షిత్‌ శెట్టి పరిచయం అవగానే తను చాలా వ్యత్యాసంగా అనిపించాడని చెప్పింది. ఆయనపై పుట్టిన ప్రేమ కారణంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అయితే సినిమాలో ఇద్దరం పేరు తెచ్చుకోవాలని ఆశ పడడంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. అయితే అలా రెండేళ్లు గడిచిన తరువాత కూడా అవకాశాలు అధికం అవ్వడంతో పెళ్లికి సమయాన్ని కేటాయించడం తనకు సాధ్యం కాలేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బందులకు గురి చేసినట్లవుతోందని భావించానంది. వారికి అలాంటి సమస్యలను తెచ్చిపెట్టరాదనే తాను పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పింది. 

కాగా ఇదే విషయంపై ఇటీవల తాను హీరోగా నటించిన పంచాక్షరం చిత్ర ప్రమోషన్‌ కోసం వచ్చిన నటుడు, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్‌శెట్టి స్పందిస్తూ కొన్ని విషయాలను మరచిపోవడమే మంచిది అని పేర్కొన్నారు. అయితే ఆయన నటి రష్మిక చెప్పినంత ఈజీగా తన పెళ్లి రద్దు సంఘటనను తీసుకోలేదనే అర్థం ధ్వనించడం విశేషం. అన్నట్టు ప్రియుడితో పెళ్లికి గుడ్‌భై చెప్పిన రష్మిక నటిగా చాలా బిజీగా ఉంది. అయితే కాస్త విరామాన్ని కల్పించుకుని హ్యాపీ న్యూఇయర్‌ను రోమ్‌ నగరంలో ఎంజాయ్‌ చేయడానికి ఆ దేశానికి పరుగెడుతోంది. మళ్లీ జనవరి 5న తిరిగి వచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటుందట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు