పల్లెటూరి పిల్లలా..

20 Sep, 2019 00:42 IST|Sakshi
రష్మికా మందన్నా

‘రంగస్థలం’ సినిమాలో సమంతను అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చూపించారు దర్శకుడు సుకుమార్‌. ఈసారి రష్మికా మందన్నాను కూడా పల్లెటూరి అమ్మాయిలా మార్చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమాలో రష్మిక పాత్ర కట్టు, బొట్టు, మాట తీరు అన్నీ కొత్తగా ఉంటాయని సమాచారం. ఇప్పటివరకూ రష్మిక చేసిన పాత్రలకు ఈ పాత్ర విభిన్నంగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ నెలలో సెట్స్‌ మీదకు వెళ్ల నుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు