పోటీ తర్వాత పోటీ!

30 May, 2020 07:02 IST|Sakshi

‘‘టీనేజ్‌ నుంచి నా జీవితం రేస్‌లా పరిగెడుతూనే ఉంది. విరామం అనేది లేకుండా. కానీ ఇలాంటి బ్రేక్‌ (లాక్‌డౌన్‌) ఎప్పుడూ దొరకలేదు’’ అంటున్నారు రష్మికా మందన్నా. కరోనా వైరస్‌ కారణంగా అందరి ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్‌ పడింది. అందరూ ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడుపుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండటం గురించి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘నా 18 ఏళ్ల వయసు నుంచి నా లైఫ్‌ రేస్‌లానే ఉంది. ఏదైనా పనిలో గమ్యానికి చేరుకున్నాం అని అనుకునేలోగా మరో కొత్త రేస్‌ మొదలయ్యేది.

ఇలా ఒకటి పూర్తవ్వగానే మరోటి. అది పూర్తవ్వగానే మరో రేస్‌లో పరిగెడుతున్నాను. బాధతో ఇలా చెప్పడంలేదు. ఎందుకంటే నా లైఫ్‌ ఇలానే ఉండాలని కోరుకున్నాను కూడా. ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం నాకిదే మొదటిసారి. స్కూల్‌ నుంచి కాలేజీ వరకూ ఇంటికి దూరంగా హాస్టల్‌లోనే ఉన్నాను. మా అమ్మానాన్నలు ఎందుకు నాతో అంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారనుకునేదాన్ని. అసలే టీనేజ్‌.. అందులో నేను కొంచెం రెబల్‌గా ఉండేదాన్ని. దాంతో అలా అనుకున్నానేమో? కానీ ఇప్పుడు వాళ్ల మీద నాకలాంటి ఫీలింగ్‌ లేదు.

సినిమా షూటింగ్స్‌ కోసం రాత్రంతా మా అమ్మగారు నాతోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడపడానికి నాన్న పడే తపనను మాటల్లో చెప్పలేను. ఈ లాక్‌డౌన్‌ వల్ల నా కుటుంబంతో రెండు నెలలు గడిపే అవకాశం వచ్చింది. ఈ సమయంలో ఎవ్వరం మా పనుల గురించి మాట్లాడుకోలేదు. నన్ను చాలా గారాభంగా చూసుకుంటున్నారు. భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని నాలో నింపుతున్నారు. ఇంట్లోనే ఉండి నేనింత హ్యాపీగా, కామ్‌గా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కష్టపడి పని చేసి అలసిపోయి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ప్రశాంతంగా అనిపించిందంటే మీరు అదృష్టవంతులే, నన్ను నమ్మండి’’ అన్నారు రష్మికా మందన్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు