అవకాశాలు ముఖ్యం కాదు

4 Jan, 2020 10:28 IST|Sakshi

సినిమా: నాకు అవకాశాలు ముఖ్యంకాదు అని చెప్పుకొచ్చింది నటి రష్మిక. టాలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్‌ను సంపాధించుకున్న కన్నడ నటి ఈ బ్యూటీ. తొలి రోజుల్లోనే ప్రేమలో ఓలలాడడం, విడిపోవడం వంటి వాటితో వార్తల్లోకి ఎక్కిన రష్మిక ఇప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. నిజానికి తెలుగులో ఈ అమ్మడు నటించిన నాలుగే చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఛలో చిన్న చిత్రంగా విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆ తరువాత నటించిన గీతాగోవిందం చిత్రమే రష్కిక కేరీర్‌ను పెద్ద మలుపు తిప్పింది. ఆ తరువాత నటించిన డియర్‌ కామ్రేడ్, దేవదాస్‌ చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. అయినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా రష్మికకు ఇక్కడ కార్తీతో సుల్తాన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ వరించింది. ఈ చిత్రం కనుక హిట్‌ అయితే కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి పట్ట పగ్గాలుండవు. కాగా ఇటీవల నటి రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ విజయం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుందన్నారు. అలాగని హిట్‌ అయిన చిత్రాలను, ప్లాప్‌ అయిన చిత్రాలను తాను వేర్వేరుగా చూడనని చెప్పింది.

తనకు రెండూ సమానమేనని అంది. వాస్తవానికి సక్సెస్‌ అయిన చిత్రాల కారణంగా మరిన్ని అవకాశాలు రావచ్చునని, ఇంకా బాగా డబ్బు సంపాధించుకోవచ్చునని అంది. అయితే తన దృష్టిలో డబ్బు, అవకాశాలు ముఖ్యం కాదని అంది. ఆ చిత్రాల్లో తన శ్రమ ఎంత? వాటి ద్వారా ఏం నేర్చుకున్నాను అన్నదే ముఖ్యం అని చెప్పింది. సరైన ఫలం చేకూరలేదంటే మన శ్రమ వృథా అయ్యిందనే బాధ ఉంటుందని అంది. అయితే అవి నేర్పించిన విషయాలతో మనసును సర్ధి చెప్పుకోవాలని చెప్పుకోవాలంది. ఇకపోతే పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య తారతమ్యాలు ఉండవచ్చునేమోగానీ, ఫలితాలు హీరోలపై ఎంత ప్రభావం చూపుతాయో, అంత ప్రభావాన్నీ హీరోయిన్లపై చూపుతాయని చెప్పింది. ఒక్కో సమయంలో హీరోలను మాత్రమే ఎక్కువ బాధించే అవకాశం ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. అయినా ఈ సక్సెస్, ప్లాప్‌ల గొడవ ఇప్పుడెందుకు ప్రస్థావిస్తుందో? భవిష్యత్‌లో ప్లాప్‌లు వస్తాయనే ముందు జాగ్రత్తలో భాగంగా రిష్మిక ఇలా ఏకరువు పెట్టడం లేదు కదా! ఏదేమైనా వినేవాళ్లుంటే ఏదైనా చెబుతారిలాంటోళ్లు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...