హ్యాండిచ్చిన రష్మిక!

16 Jun, 2019 09:59 IST|Sakshi

ప్రతిభ కంటే ముఖ్యంగా సినీరంగంలో హీరోయిన్లకు లక్‌ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిభ ఉండీ పైకి రానివారెందరో ఉన్నారు. అయితే ఇక్కడ విజయాలే కొలమానం. వాటిని అందుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ తరువాతనే పని, ప్రతిభ. అందుకే ఏ హీరో, హీరోయిన్‌ అయినా, దర్శకుడైనా మొదట్లో ఒక్క అవకాశం అంటూ ఎక్కే మెట్లు, దిగే మెట్లు అంటూ చెప్పులరిగేలా  నిర్మాణ సంస్థల కార్యాలయాలకు తిరుగుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నటి రష్మిక మందన్న కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటించడానికి సమ్మతించి తరువాత సారీ అనేశారట.

ఇదే ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్న న్యూస్‌. రష్మిక శాండిల్‌వుడ్‌కు చెందిన నటి. మాతృభాషలో కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే ప్రేమ, బ్రేక్‌ అప్‌ లాంటి అంశాలతో బాగానే వార్తల్లో నానింది. అలాంటిది టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం గీతాగోవిందం ఈ అమ్మడి తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతం అక్కడ క్రేజీ హీరోయిన్‌. ఏకంగా విజయ్‌తో నటిస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి.

అయితే అలాంటివి వదంతులకే పరిమితం అయినా, తాజాగా కార్తీతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో నటించడానికి అంగీకరించారని సమాచారం.  దర్శకుడు విఘ్నేశ్‌ శివన్, నటుడు శివకార్తికేయన్‌ల కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది.

ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీస్‌ కియారా, శ్రద్ధాకపూర్‌లలో ఒకరిని ఎంపిక చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఫైనల్‌గా రష్మికను ఎంపిక చేశారట. శివకార్తికేయన్‌తో నటించడానికి అంగీకరించిన రష్మిక ఆ తరువాత సారీ చెప్పి వైదొలగినట్లు టాక్‌ వైరల్‌ అవుతోందిప్పుడు.

తాజాగా తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో నటించే అవకాశం రావడంతో, శివకార్తికేయన్‌ చిత్రానికి కాల్‌షీట్స్‌ సమస్య తలెత్తడంతో టాటా చె ప్పేసినట్లు సమాచారం. సరే తెలుగులో పెద్ద అవకాశం రావడంతో కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధం అయ్యిందనుకుందాం. అయితే ఈ అమ్మడు చెప్పే కారణం ఏమిటో తెలుసా? శివకార్తికేయన్‌ చిత్రంలో తన పాత్రకు ఎక్కువ స్కోప్‌ లేకపోవడంతోనే ఆ చిత్రాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!